ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన పరిటాల సునీత
సత్యసాయి: 'దివ్యాంగ శక్తి' పథకాన్ని ధర్మవరం ఏపీఎస్ఆర్టీసీ బస్సు డిపోలో MLA పరిటాల సునీత ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, దివ్యాంగులు పాల్గొన్నారు. దివ్యాంగుల సంక్షేమం, సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆమె పేర్కొన్నారు.