VIDEO: వరి కోతల తర్వాత పొలాల్లో బాతుల సందడి
NDL: వరి కోతలు పూర్తయ్యాక చెన్నై, తమిళనాడు ప్రాంతాల నుంచి బాతుల గుంపులు మహానంది, బండి ఆత్మకూరు మండలాల వరి పొలాలకు చేరుకుంటాయి. రైతులతో ఒప్పందం కుదుర్చుకుని బాతులను పొలాల్లో వదులుతారు. బాతులు మిగిలిన గింజలతో పాటు క్రిమికీటకాలను తిని చీడపీడలను తగ్గిస్తాయి. దీంతో రైతులకు సహజంగా లాభం కలుగుతోంది.