కోరుకొండ మండలంలో వైసీపీకి బిగ్ షాక్
E.G: కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామానికి చెందిన 100 మంది వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో సోమవారం జనసేన గూటికి చేరారు. ఈ సందర్భంగా వారికి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలు, పాలన దక్షతకు ఆకర్షితులై పార్టీలోకి చేరినట్లు తెలిపారు.