కొర్లకోటలో గ్రామ స్వచ్ఛతపై కళాజాత బుర్రకథ

SKLM: ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామంలో బుధవారం స్వచ్ఛత కళాజాత బుర్రకథ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ ప్రతినిధి సనపల అప్పలనాయుడు, పంచాయతీ కార్యదర్శి, పారిశుద్ధ్య కార్మికులు, ఎంపీటీసీ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి తడి చెత్త పొడి చెత్తను విడివిడిగా పారిశుధ్య కార్మికులకు అందించాలని కోరారు. వీధుల్లో చెత్త వేయకూడదని, బహిరంగ మలమూత్ర విసర్జన చేయవద్దని కోరారు.