ఈనెల 30 నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
TPT: తిరుమలలో ఈనెల 30 నుంచి ఏప్రిల్ 1 వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహించనున్నారు. మార్చి 30న ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరిస్తారు. ఈ మూడు రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక ఊరేగింపులు, స్నపన తిరుమంజనం, వసంతోత్సవాల సందర్భంగా పలు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.