కాకతీయ యూనివర్సిటీ కూడలి కళావిహీనం

కాకతీయ యూనివర్సిటీ కూడలి కళావిహీనం

HNK: కాకతీయ యూనివర్సిటీ కూడలి ప్రాంతం కళావిహీనంగా మారింది. నగర సుందరీకరణలో భాగంగా GWMC అధికారులు రూ. లక్షలు వెచ్చించి ప్రధాన కూడళ్లను కళాకృతులతో అందంగా తీర్చిదిద్దారు. కానీ, KU కూడలిలో నెలల క్రితం నీటి పైప్ లీకేజీ కారణంగా తవ్విన గుంతలను మరమ్మతు చేసి గోడలు నిర్మించకుండా వదిలేశారు. దీంతో ఈ ప్రాంతం అందం కోల్పోయింది. ప్రజలు దీనికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.