'వార్ 2' మూవీ డబ్బింగ్ పనులు స్టార్ట్?

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, జూ.ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో 'వార్ 2' మూవీ రాబోతుంది. తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వచ్చే వారం ఎన్టీఆర్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. అన్ని భాషల్లో స్వయంగా ఆయనే డబ్బింగ్ చెప్పబోతున్నాడట. ఇక ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు.