VIDEO: 10వ రోజుకు చేరిన విద్యుత్ కార్మికుల సమ్మె
జనగామలో విద్యుత్ ఆర్టిజన్ల నిరవధిక సమ్మె 10వ రోజుకు చేరుకుంది. ప్రభాకర్ నాయకత్వంలో కార్మికులు విధులు బహిష్కరించి DE కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తమను రెగ్యులరైజ్ చేసినా బెనిఫిట్స్ ఇవ్వడం లేదని, ఫిక్స్‌డ్ శాలరీ విధానం, ప్రమోషన్ల లేమిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.