నాగలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

నాగలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

NZB: ఆర్మూర్ పట్టణంలోని నాగలింగేశ్వర ఆలయంలో సోమవారం శివునికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివలింగాన్ని శోభాయమానంగా అలంకరించి, శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. పట్టణంలోని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అల్పాహార వితరణ చేసి, భక్తిశ్రద్ధలతో భజన కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు.