డ్రంక్ అండ్ డ్రైవ్.. ఓ వ్యక్తికి జైలు శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్.. ఓ వ్యక్తికి జైలు శిక్ష

KMR: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఒకరికి జైలు శిక్ష విధించడం జరిగిందని బిక్కనూర్ SI ఆంజనేయులు తెలిపారు. మండల కేంద్రానికి చెందిన ముత్యపు ఆంజనేయులు మద్యం తాగి వాహనం నడిపడంతో అతడిపై కేసు నమోదు చేసి ఇవాళ కోర్టులో హాజరుపరచామన్నారు. విచారించిన మెజిస్ట్రేట్ ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించినట్లు SI వెల్లడించారు.