నూతన GHMకు ఆత్మీయ సన్మానం

నూతన GHMకు ఆత్మీయ సన్మానం

SRD: మనూరు మండలం బోరంచ హై స్కూల్ నూతన గెజిటెడ్ హెడ్మాస్టర్ శివకుమార్ స్వామికి శుక్రవారం రాత్రి ఖేడ్ పట్టణంలో తాలూకా వీరశైవ జంగమ సమాజ్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం చేశారు. ఇలా మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని జంగమ సమాజ స్వాములు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. GHM శివకుమార్ మాట్లాడుతూ.. విద్యాభివృద్ధి కోసం, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేస్తానన్నారు.