అటవీ భూముల ఆక్రమణకు అనుమతించవద్దు: కలెక్టర్
KMM: జిల్లాలోని అటవీ భూముల ఆక్రమణకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన అటవీ సంరక్షణ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. పోడు భూముల పట్టా పొందిన కొంత మంది రైతులను మభ్యపెట్టి సమీపంలో ఉన్న అటవీ భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందుతుందన్నారు.