కులం పేరుతో దూషించాడని సూసైడ్‌కు యత్నం
NLR: విడవలూరు(M) ముదిపర్తిలో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రేమ వివాహం చేసుకున్న తనకు సహాయం చేయమని కోరగా టీడీపీ నాయకుడు రఫీ కులం పేరుతో దూషించాడని మనస్థాపం చెందాడు. 14 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది.. లేకపోతే విషం తాగు అని అతడు బెదిరించడంతో సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు. స్థానికులు స్పందించి వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.