కాలనీలు ముంపు బారిన పడకుండా తక్షణ చర్యలు: తాతయ్య

ఎన్టీఆర్: జగ్గయ్యపేట పట్టణంలోని ఊర చెరువు, ఎర్రకాలువ, యాపల వాగు ముప్పు ప్రాంతాలను బుధవారం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. కాలనీలు ముంపు బారిన పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సులభంగా చేరేందుకు ఉన్న అన్ని అడ్డంకులను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని సూచించారు.