సౌదీ యువరాజుపై నిమిషాల్లోనే మాట మార్చిన ట్రంప్
సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'అతను నా కాళ్లకు నమస్కరిస్తాడని నేను అనుకోలేదు' అంటూ ఫ్లోరిడా వేదికగా వివాదానికి తెరలేపారు. ఇరాన్‌తో యుద్ధంలో గల్ఫ్ దేశాల సహకారంపై మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే వెంటనే మాట మార్చిన ట్రంప్.. MBS ఒక 'యోధుడు', 'అద్భుతమైన వ్యక్తి' అని కొనియాడారు.