ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు

ప్రకాశం: కనిగిరి మండల పరిషత్ కార్యాలయం నందు పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకలును గురువారం కనిగిరి ఎంపీపీ దంతులూరి ప్రకాశం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ అంబేద్కర్, గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి డీఎల్‌డీఓ శ్రీనివాస రెడ్డి, కనిగిరి ఎంపీడీఓ హనుమంత రావు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.