విషాదం.. స్కూలులో విద్యార్థిని ఆత్మహత్య
AP: నెల్లూరు(D) మర్రిపాడు(M) కృష్ణాపురం నవోదయ స్కూలులో విషాదం చోటుచేసుకుంది. రాత్రి స్కూల్ మెట్ల వద్ద గ్రిల్స్‌కు ఉరివేసుకుని విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. అయితే తమ కూతురిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని విద్యార్థిని తండ్రి ఆరోపిస్తున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.