342 పొగాకు బేళ్ల తిరస్కరణ

ప్రకాశం: కొండపి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం జరిగిన వేలంలో అధికంగా 342 బేళ్లను కొనుగోలుదారులు తిరస్కరించారు. వివిధ గ్రామాల రైతులు 1,227 బేళ్లు తీసుకురాగా కేవలం 885 బేళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. అధిక శాతం బేళ్లు తిరస్కరణకు గురికావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలం కేంద్రం అధికారి జోక్యం చేసుకుని కొనుగోలు సక్రమంగా జరిగేలా చూడాలని రైతులు కోరారు.