విధుల్లో ఉండగానే కుప్పకూలి వెయిటర్ మృతి
NLG: నల్గొండలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ ఉద్యోగి చిన్నేని వెంకన్న విధుల్లో ఉండగానే హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందారు. అనారోగ్యం కారణంగా విధులకు దూరంగా ఉన్న ఆయన నిన్ననే మళ్లీ పనిలో చేరారు. తోటి సిబ్బంది సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. యాజమాన్యం తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.