'బాబూ జగ్జీవన్ రామ్ పోరాటం అందరికి స్ఫూర్తిదాయకం'
MNCL: బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా అయన చిత్రపటానికి పూలమాల వేసి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి నివాళులు అర్పించారు. ఆమె మాట్లాడుతూ.. బాబూ జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం సాగించిన పోరాటం అందరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. వైస్ ఛైర్మన్ సత్యనారాయణ, కమిషనర్, కౌన్సిలర్‌లు పాల్గొన్నారు.