నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
NGKL: నిరుద్యోగ యువతలో నైపుణ్యం పెంచేందుకు ప్రభుత్వం కల్వకుర్తి ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీలో రెండు వారాల స్వల్పకాలిక కోర్సులను ప్రారంభించనుంది. 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్ కింద ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ కె.జయమ్మ తెలిపారు. ఆసక్తి గల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.