పాముగడ్డలో ఊబిలోపడి ఊపిరి ఆడక వ్యక్తి మృతి

పాముగడ్డలో ఊబిలోపడి ఊపిరి ఆడక వ్యక్తి మృతి

AKP: అచ్యుతాపురం(మం) దొప్పర్ల శివారు పాముగడ్డలో ప్రమాదవశాత్తు ఊబిలో పడి లాలం సత్యరావు(52) అనే వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం రోజు లాగే కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన సత్యరావు ప్రమాదవశాత్తూ కాలు జారి ఊబిలో పడి ఊపిరి ఆడక చనిపోయాడు. ఈ ఘటనపై భార్య వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.