VIDEO: రోజురోజుకు దిగజారుతున్న పారిశుద్ధ్యం
TPT: సూళ్లూరుపేట బైపాస్ వద్ద డంపింగ్ యార్డు రోజురోజుకు హైవే వైపు పెరగడం వల్ల ప్రయాణికులు, హోటల్ ప్రాంతాల ప్రజలు తీవ్ర దుర్వాసన, దోమలు, ఈగలతో నరకం అనుభవిస్తున్నారు. చిన్న వర్షం పడినా చెత్త రోడ్డుమీదికి చేరి మరింత అధ్వాన పరిస్థితులు నెలకొంటున్నాయి. మున్సిపల్ సిబ్బంది స్పందించడం లేదని పలువురు మండిపడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు.