బిక్కనూర్‌లో నాడు ఎంపీపీ నేడు సర్పంచ్
KMR: బిక్కనూరు మండల కేంద్రానికి చెందిన బాల్యాల రేఖ ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్‌గా ఘన విజయం సాధించారు. గతంలో (2006లో) ఆమె కాంగ్రెస్ మద్దతుతో ఎంపీటీసీగా గెలుపొంది ఎంపీపీగా పనిచేసిన అనుభవం ఉంది. అదే స్ఫూర్తితో మళ్ళీ ఈసారి సర్పంచ్‌గా పోటీ చేయడంతో గ్రామస్థులు ఆమెకు అండగా నిలబడి భారీ మెజార్టీతో గెలిపించారు.