రేపు జిల్లాలో వర్షాలు పడే అవకాశం

రేపు జిల్లాలో వర్షాలు పడే అవకాశం

GNTR: జిల్లాలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు బుధవారం వరకు కొనసాగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కూర్మనాథ్ శనివారం వెల్లడించారు. ఆదివారం గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉండగా, సోమవారం, మంగళవారం పలు చోట్ల పిడుగులు కూడా పడే అవకాశముందన్నారు. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు పెరిగే సూచనలు ఉన్నాయన్నారు.