ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్

VSP: ఆల్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లాలో మెంటాడకు చెందిన బొడ్డు తిరుపతి (25), గొట్టాపు నాగేంద్రబాబు (25), రాపర్తి నాగేశ్వరరావు(25)ను అరెస్టు చేసి వారి నుంచి మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు.