బ్రహ్మసాగర్ ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్

KDP: కడప జిల్లా బీ.మఠం మండల కేంద్రంలోని బ్రహ్మసాగర్ ప్రాజెక్టును శుక్రవారం కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా బ్రహ్మసాగర్ ప్రాజెక్టులో పలు అభివృద్ధి కార్యక్రమాలపై తెలుగు గంగా ఆధికారులతో చర్చించారు. వీలైనంత తొందరగా తగుపనులు పూర్తి చేయాలని కలెక్టర్ వారిని ఆదేశించారు.