కూతురు మరణం తట్టుకోలేక తండ్రి సూసైడ్

MDK: కూతురు మరణం తట్టుకోలేక ఓ తండ్రి సూసైడ్ చేసుకున్న విషాద ఘటన జిల్లాలో జరిగింది. ఎస్సై నరేశ్ తెలిపిన వివరాలిలా.. హవేలిఘనపూర్ మం. సర్ధనకు చెందిన పిల్లి కృష్ణ కూతురు ఏడాది క్రితం అనారోగ్యంతో చనిపోయింది. దీంతో కూతురు మరణం తట్టుకోలేక నరేశ్ మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇంట్లోంచి బయటకు వెళ్లిన ఆయన గ్రామ సమీపంలో చెట్టుకు ఉరేసుకున్నాడు.