నేటి నుంచే ఓటర్ల జాబితా సవరణ
TG: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు ఇవాళ్టి నుంచి 23 వరకు ఓటర్ల జాబితాను సవరించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఈ నెల 26న ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే 2 దశల్లో ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉందని సమాచారం.