3 నెలల్లో రంగనాథస్వామి ఘాట్ పనులు పూర్తి: మంత్రి

NLR: రానున్న మూడు నెలల్లో 52 డివిజన్‌లోని పినాకిని పార్క్ పొట్టే పాలెం వరకు అభివృద్ధి చేసి బోటింగ్ అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి నారాయణ తెలిపారు. తల్పగిరి రంగనాథ స్వామిని దర్శించుకున్నఅనంతరం ఆయన ఘాట్ పనులను పర్యవేక్షించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా రంగనాయకుల స్వామి గుడిలో అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.