మాకవరపాలెం జూనియర్ కాలేజీకి అభివృద్ధి
AKP: మాకవరపాలెం గవర్నమెంట్ జూనియర్ కాలేజీ అభివృద్ధికి నిధులు కేటాయించనున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. బుధవారం కాలేజీని సందర్శించిన ఆయన, కాంపౌండ్ వాల్, స్టేజి నిర్మాణాలకు అవసరమైన ఎస్టిమేషన్లు వెంటనే సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కాలేజీ అభివృద్ధిపై స్థానికులు, అధ్యాపక సిబ్బందితో చర్చించి అవసరాలను తెలుసుకున్నారు.