'హై టెన్షన్ విద్యుత్ స్తంభాలను తొలగించాలి'

KDP: గండి క్షేత్రంలో హై టెన్షన్ విద్యుత్ స్తంభాలను తొలగించాలని రైతు సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సింగారెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం గండిలో ఆయన మాట్లాడుతూ.. శ్రావణమాసంలో వేలాది సంఖ్యలో పాపాగ్ని నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. హై టెన్షన్ విద్యుత్ వైర్లతో పాపాగ్ని నదిలో ఉన్న భక్తులు షాక్‌కు గురవుతున్నారని, వాటి తొలిగించాలని ఆయన కోరారు.