ఈనెల 25న విభిన్న ప్రతిభావంతుల క్రీడలు
ELR: వచ్చే నెల 3న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఆ శాఖ ఏడీ రామ్ కుమార్ తెలిపారు. ఈ పోటీల్లో 600 మంది క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. విజేతలకు కలెక్టర్ వెట్రిసెల్వి బహుమతులు అందజేస్తారని ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.