నదీ స్నానం ఆచరించిన మంత్రాలయం పీఠాధిపతి
KRNL: చంద్రగ్రహణ సమయం అనంతరం కొన్ని నియమాలను పాటించాలని, అందులో ముఖ్యమైనది నది స్నానం చేయడం శ్రేయస్కారం అని మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీ తెలిపారు. ఆయన తన శిష్య బృందంతో కలిసి పరిమళ పుష్కరిణిలో గ్రహణం అనంతరం స్నానాన్ని ఆచరించారు. అనంతరం మూల బృందానికి పంచామృత అభిషేకాలు చేసి, మంగళ హారతులు ఇచ్చారు.