టూ టౌన్ SI ఆత్మహత్య
KNR: పట్టణ టూ టౌన్ SI చంద్రశేఖర్ ఇవాళ ఆత్మహత్యకు పాల్పడ్డారు. జమ్మికుంట మండలం సీతంపేటలోని అత్తింటిలో ఉరివేసుకున్నారు. కాగా, గత 5 రోజుల క్రితమే చంద్రశేఖర్ భార్య దివ్య కూడా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భార్య మరణంతో మనస్తాపానికి గురైన ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.