నేడు గుంటూరులో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
GNT: గుంటూరు జిల్లా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శుక్రవారం రెవెన్యూ కల్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు డీఈవో సి.వి రేణుక తెలిపారు. 9 మంది ప్రధానోపాధ్యాయులకు, తత్సమాన కేటగిరీలో 20 మంది స్కూల్ అసిస్టెంట్లకు, 25 మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందజేస్తామన్నారు. ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు.