యాగంటి ఉమామహేశ్వర స్వామికి విశేష పూజలు
NDL: బనగానపల్లె మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో గురువారం ఫాల్గుణ మాసం పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈవో పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి రుద్రాభిషేకం, కుంకుమార్చన, బిల్వర్చన జరిగాయి. విశేష పుష్పాలంకరణతో మహా మంగళహారతి నిర్వహించారు. అలాగే నందవరం చౌడేశ్వరి మాత ప్రత్యేక పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు భారీగా తరలివచ్చారు.