ఉగ్ర దాడులకు నిరసనగా జనసేన దీక్షలు

VZM: కాశ్మీర్ ఉగ్ర దాడికి నిరసనగా జన సైనికులు నోరు మూసుకొని నిరసన దీక్షలు చేపట్టారు. రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు గురువారం జనసేన పార్టీ పీఏసీ సభ్యురాలు మాజీ మంత్రి పడాల అరుణ ఆధ్వర్యంలో జనసైనికులు నిరసన దీక్షలు చేపట్టారు. ఈ నిరసనలో మండల పార్టీ అధ్యక్షుడు మునకాల జగన్నాథరావు (జగన్) తదితరులు పాల్గొన్నారు.