అత్యాశతో బెట్టింగ్ యాప్స్ వలలో పడవద్దు: ఎస్సై
AKP: అత్యాశతో బెట్టింగ్ యాప్స్ వలలో పడవద్దని గొలుగొండ ఎస్సై రామారావు హెచ్చరించారు. బెట్టింగ్ నిర్వహించినా, పాల్గొన్నా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల మొబైల్ వినియోగంపై నిఘా ఉంచాలని సూచించారు. క్రికెట్ వినోదం మాత్రమే, దాన్ని జూదంగా మార్చుకోవడం జీవిత నాశనానికి దారి తీస్తుందని చెప్పారు.