రో-కో రిటైర్ అయితే సంతోషిస్తా: అఫ్ఘనిస్తాన్ క్రికెటర్
అఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రహ్మనుల్లా గుర్బాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'ఒక అఫ్ఘనిస్తాన్ ఆటగాడిగా.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారత జట్టులో లేకుంటేనే సంతోషిస్తా. వన్డేలకు కూడా వాళ్లు రిటైర్ అవ్వాలి. వారు టీమిండియాలో ఉంటే.. ఆ జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారిద్దరూ లెజెండ్స్. నిజానికి వారు జట్టులో లేకుంటేనే ప్రత్యర్థి జట్లు చాలా సంతోషపడతాయి' అని గుర్బాజ్ అన్నాడు.