దర్శిలో పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి కార్యక్రమం

NLR: దర్శిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా దర్శి YCP కార్యాలయంలో నాయకులు అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదుపరి వారు మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు తలుచుకొని కొనియాడారు.