మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన గోపీ
W.G: మాజీ సీఎం వైఎస్ జగన్‌ను తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో పాలకొల్లు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు(గోపీ) మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జగన్ సూచించినట్లు గోపాలరావు తెలిపారు.