‘సమస్యలను ఎత్తి చూపితే.. నిషేధిస్తారా?’

KDP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేశారని, ప్రశ్నిస్తున్న విద్యార్థి సంఘాలపై కత్తి పెట్టడం దారుణమని వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు మండిపడ్డారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్‌కి విద్యార్థి సంఘాలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని వారు నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు