'అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి'
SRCL: ప్రతి సోమవారం ప్రజావాణికి వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా, ఇంఛార్జి కలెక్టర్ హాజరై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 149 అర్జీలు రాగా, వాటిని పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు అందజేయాలి అన్నారు.