ఈనెల 9న మహిళా టీచర్లకు సర్వీస్ 'ఎక్స్టెన్స్ అవార్డ్స్' పంపిణి
కోనసీమ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 9న మహిళా ఉపాధ్యాయులకు 'ఎక్స్టెన్స్ అవార్డ్స్' అవార్డులను ప్రదానం చేయనున్నారు. ముమ్మిడివరంలోని ఎయిమ్స్ కళాశాల సెమినార్ హాల్లో జిల్లా విద్యాశాఖాధికారి పి. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వివిధ క్యాడర్లలో ఉత్తమ సేవలు అందించిన 215 మంది ఉపాధ్యాయులను సత్కరించనున్నారు.