చేపల వేటకు వెళ్ళి వ్యక్తి మృతి

NLG: చేపల వేటకు వెళ్ళి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం మిర్యాలగూడ మండలం చిల్లాపురంకు చెందిన బొడ్డుపల్లి లక్ష్మి నారాయణ చేపలు పట్టేందుకు వెళ్లాడు.చేపలు పడుతున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు MLG రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య తెలిపారు.