144 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల
బెంగాల్ ఎన్నికలకు సంబంధించి తొలి అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. 144 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం నందిగ్రామ్ నుంచి సువేందు అధికారి, అసన్సోల్ దక్షిణ్ నుంచి అగ్నిమిత్ర పాల్, శిబ్‌పూర్ నుంచి రుద్రనీల్ ఘోష్, ఉలుబేరియా దక్షిణ్ నుండి స్వామి మంగళానంద పురి, చక్దా నుంచి బంకిం చంద్ర ఘోష్, పాంస్కురా నుంచి సుబ్రతా మైత్రా పోటీలో ఉన్నారు.