BT రోడ్డు, బ్రిడ్జి నిర్మాణ పనులకు MLA శంకుస్థాపన
ASF: రోడ్డు సౌకర్యం లేని దహేగాం మండలం బొప్పురం గ్రామానికి ఉపశమనం లభించింది. రూ. 3.13 కోట్ల వ్యయంతో నిర్మించనున్న BT రోడ్డు, బ్రిడ్జి నిర్మాణ పనులకు MLA హరీష్ బాబు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని ఆయన తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల రాకపోకల సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని పేర్కొన్నారు.