గంజాయి రవాణా కేసులో నలుగురికి 5 ఏళ్లజైలు శిక్ష

గంజాయి రవాణా కేసులో నలుగురికి 5 ఏళ్లజైలు శిక్ష

ASF: గంజాయి రవాణా కేసులో నలుగురికి 5ఏళ్ల జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికీ రూ.50వేల చొప్పున జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ జిల్లా సెషన్ కోర్టు తీర్పునిచ్చిందని SP కాంతిలాల్ పాటిల్ ప్రకటనలో తెలిపారు. 2021 ఆగస్టు 21న లావుడ్యా ఉదల్, గుగ్గోత్ భరత్, రాథోడ్, విష్ణుల వద్ద గంజాయి లభించడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో నిర్ధారణ కావడంతో శిక్ష విధించారన్నారు.