మంత్రాలయం అభివృద్ధికి నిధులు మంజూరు

మంత్రాలయం అభివృద్ధికి నిధులు మంజూరు

కర్నూలు జిల్లా బడ్జెట్ సమావేశంలో మంత్రాలయం నియోజకవర్గానికి రూ.6.60 కోట్లు కేటాయించడంపై సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రాలయం ఇన్‌ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. మంత్రాలయంలో ఇండోర్ స్టేడియం నిర్మాణం కోసం రూ.5 కోట్లు, మైనార్టీ కేంద్రం రూ.80 లక్షలు, కోసిగిలో వాల్మీకి భవన్ నిర్మాణం కోసం రూ.80 లక్షలు నిధులు మంజూరు చేశారన్నారు.